పూజాహెగ్డేకు ‘రాధేశ్యామ్’ బర్త్ డే విషెస్

బుట్ట బొమ్మ పూజా హెగ్డే పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు, సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా పూజ హెగ్డేకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేపథ్యంలో ఆమె నటిస్తున్న పాన్ ఇండియా రొమాంటిక్ మూవీ “రాధేశ్యామ్” టీం పూజాహెగ్డేకు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసింది. అందులో పూజా హెగ్డే వైట్ డ్రెస్ లో ఏంజెల్ లా ఉంది. ఈ చిత్రంలో పూజా హెగ్డే పాత్ర పేరు ప్రేరణ అని తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రకటించిన చిత్ర బృందం ప్రేరణకు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ తాజా పోస్టర్ ను విడుదల చేశారు. అంటే ఆదిత్య ప్రేరణను లవ్ చేస్తాడు. కాగా ఈ చిత్రం జనవరి 14న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రాధేశ్యామ్’ను యువి క్రియేషన్స్ నిర్మిస్తోంది.

Read Also : అనసూయ వార్నింగ్.. నా పేరు వాడితే కోర్టుకీడుస్తా..!

మరోవైపు పూజాహెగ్డే వరుస సినిమాలతో సౌత్ లో స్టార్ హీరోయిన్ రేసులో కొనసాగుతోంది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం దసరా పండగ ప్రత్యేకంగా అక్టోబర్ 14న థియేటర్లలోకి రానుంది. ఇంకా ఆచార్య చిత్రంతో పాటు పవన్ కళ్యాణ్ సినిమాలోనూ పూజాహెగ్డే కనిపించబోతోంది.

-Advertisement-పూజాహెగ్డేకు 'రాధేశ్యామ్' బర్త్ డే విషెస్

Related Articles

Latest Articles