పవన్ తో పూజా హెగ్డే.. హింట్ ఇచ్చేసిందిగా!

బుట్టబొమ్మ పూజా హెగ్డే వరుస సినిమాలతో క్రేజీ హీరోయిన్ గా మారింది. ప్రస్తుతం ఆమె చేతిలో భారీ ప్రాజెక్ట్ సినిమాలే ఉన్నాయి. కాగా, ఈ బ్యూటీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయనుందనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్‌ నటిస్తున్న సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటించనుందనడానికి ఆమె పరోక్షంగా క్లారిటీ ఇచ్చింది.

నేడు పవన్ బర్త్ డే సందర్బంగా ప్రముఖులు విషెస్ చేస్తూ సందడి చేశారు. అయితే తాజాగా పూజా హెగ్డే కూడా పవన్ కు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేసింది. అయితే ఇది ఎవరు ఎక్స్ పెక్ట్ చేయలేని ట్వీట్ కావడంతో దాదాపు ఆమె పవన్ తో నటించనుందని తెలుస్తోంది. అంతేకాదు, పవన్ – హరీష్ శంకర్ సినిమా ప్రీ లుక్ వచ్చిన కొద్దిసేపటికే పూజా ట్వీట్స్ చేయడం విశేషం.. ప్రియమణి మరో కథానాయికగా నటించనుందని సమాచారం.

Related Articles

Latest Articles

-Advertisement-