కాంగ్రెస్ మునిగిపోతున్న పడవ…

కళ్ళు, చెవులు ఉన్న వారికి మోడీ ప్రభుత్వ కార్యక్రమాలు తెలుస్తాయి. నిన్న ఇందిరా పార్కు దగ్గర విపక్ష నేతలు ఇష్టం వచ్చి నట్టు మాట్లాడారు, అవాకులు చవాకులు మాట్లాడారు అని బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ సొంత పార్టీ లోనే కుంపట్లు ఉన్నారు. తెలుగు దేశం కాంగ్రెస్ గా మార్చారు అని సొంత పార్టీ నేతలే అంటున్నారు. స్క్రిప్టు రైటర్ ల ను పెట్టుకొని తాత్కాలిక ఆనందం కోసం మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ మునిగిపోతున్న పడవ… ఇండియన్ కమర్షియల్ పార్టీ గా మారింది. కమ్యూనిస్టు లు ఎక్కడ ఉన్నారు. పశ్చిమ బెంగాల్ లో ఒక్క ఎమ్మెల్యే గెలవలేదు.. ఉనికి లేకుండా పోయారు అని తెలిపారు. ఇక యూపీఏ హయాంలో ఏమి అమ్మలేదా అని ప్రశ్నించారు. నరేంద్ర మోడీ పై కావాలనే విషం కక్కుతున్నారు.. సీఎం దళిత బంధు ను పొగడిన నేతలకు సీతారామ ప్రాజెక్టు లో కాంట్రాక్టు లు వచ్చాయి.. లట్టు గాడు, పొట్టు గాడు ఒక్కటై విమర్శలు చేస్తున్నారు. కోడి నారాయణ ఏమి మాట్లాడుతారో ఆయనకే తెలియదు. భారత్ బంద్ దేనికి… రైతు సంక్షేమ పథకాల అమలు చేస్తున్నందుక… ఇంకా ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నందుకా అని ప్రశ్నించారు.

-Advertisement-కాంగ్రెస్ మునిగిపోతున్న పడవ...

Related Articles

Latest Articles