కేటీఆర్ అందుకే అలా మాట్లాడుతున్నారు…

ముఖ్యమంత్రి, మంత్రులు అంటే తెరాసకె కాదు.. రాష్ట్ర ప్రజలకు అనే విషయం మర్చి పోవద్దు.. వారికి మంచి బుద్ది రావాలి అని బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. కేటీఆర్ అహంకారం నెత్తికెక్కి మాట్లాడుతున్నారు. విచక్షణ కోల్పోయి, అసహనంతో మాట్లాడారు అని చెప్పిన ఆయన అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుందా… కేసీఆర్ రాజ్యాంగం నడుస్తుందా అని ప్రశ్నించారు. మీరు మాత్రం ఇష్టమొచ్చినట్టు మాట్లాడొచ్చు…  మేము ప్రశ్నించొద్ద అని అన్నారు. కేటీఆర్ మాటలను వెనక్కి తీసుకోవాలి… నువు మాట్లాడిన బాషా తెలంగాణ కె అవమానం. మోడీ ,అమిత్ ష ల మీద మాట్లాడుతావా…  దేశ సార్వభౌమత్యాన్ని కాపాడుతున్న వారి పై ఏమి మాట్లాడుతున్నావు…. బెదిరుస్తున్నవా అని అడిగారు. కేంద్రం ఇచ్చిన నిధుల పై శ్వేత పత్రం విడుదల చేయండి.. పక్క రాష్ట్రం నీళ్ల దోపిడి చేస్తున్న పాటించుకోక… ఇప్పుడు పునర్విభజన చట్టం గుర్తుకు వచ్చింద అని అన్నారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏది… ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయక.. కేంద్రం పై నిందలు మోపుతారా.. బయ్యారం పై టాస్క్ఫోర్స్ కమిటీ రిపోర్ట్ ఏది అని ప్రశ్నించారు పొంగులేటి సుధాకర్.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-