తెలంగాణలో హీటెక్కిన రాజకీయాలు.. వరుసగా నేతల పాదయాత్రలు !

తెలంగాణలో గతంలో ఎన్నడూ లేనంతగా రాజకీయ వేడి రాజుకుంది. అన్ని రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. తెలంగాణలో ఎన్నికలకు ఇంకా రెండున్నర ఏళ్లు ఉండగానే అన్ని పార్టీలు కసరత్తు మొదలుపెట్టాయి. పార్టీ నాయకత్వాన్ని అప్రమత్తం చేసి… కార్యాచరణ ఎంపిక చేసుకుంటున్నాయి. ఎవరికి వారు… తెలంగాణలో పాదయాత్రలకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే బీజేపీ షెడ్యూల్ సిద్ధంచేసుకుంది. ఇక షర్మిల కూడా అదే బాటలో నడుస్తుంది. పీసీసీ కొత్త చీఫ్ రేవంత్ రెడ్డి కూడా… తన నడకను మొదలుపెట్టాలని డిసైడ్ అయ్యారు. ఇప్పుడు ప్రధాన పార్టీలు అన్నీ… పాదయాత్రకు దారులు వేసుకుంటున్నారు.

తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్రకు ప్లాన్ చేసుకుంటున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే పాదయాత్రకు సిద్ధమయ్యారు. అయితే పార్టీలో చర్చించి పాదయాత్ర మొదలు పెట్టాలని ఆలోచిస్తున్నారు. ఆగస్ట్‌లో పాదయాత్ర చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇంతలోనే పార్టీని సెట్ చేసుకుని అడుగులు వేయాలి అన్నది రేవంత్ ఆలోచనగా కనిపిస్తోంది. ఇప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పాదయాత్ర చేయడంతో దాన్నే కంటిన్యూ చేయాలని… అందుకు నిరుద్యోగ సమస్యను అజెండాగా తీసుకోవాలని రేవంత్ భావిస్తున్నారు.

read also : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నమిత

బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పటికే పాదయాత్ర తేదీలను ఖరారుచేశారు. వచ్చే నెల 9 నుంచి పాదయాత్ర చేయబోతున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి నడిచిన దారిలోనే పాదయాత్ర ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. మొదటి విడతగా… హుజూరాబాద్ వరకు బండి సంజయ్ పాదయాత్ర ప్లాన్ చేసుకున్నారు. గడిచిన కొంతకాలంగా తెలంగాణలో పార్టీ కొంత దూకుడుగా వ్యవహారిస్తోంది. అధికార టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అంటూ రంగంలోకి దిగింది. గ్రేటర్ ఎన్నికల తర్వాత దూకుడు మరింత పెంచింది. పాదయాత్రతో గ్రామాలు చుట్టేయాలని… పార్టీకి ..మోడీకి ఉన్న గ్లామర్ తో తెలంగాణలో బలోపేతం అవ్వాలని భావిస్తోంది. దీంతో తమకు కలిసి వచ్చే ప్రతీ అంశాన్ని వదులుకోకుండా ప్లాన్ చేసుకుంటుంది.

కొత్తగా పార్టీపెట్టిన షర్మిల కూడా పాదయాత్రను ఎంచుకుంటుంది. కొన్ని రోజులుగా తెలంగాణలో పార్టీ ఏర్పాటుకు కసరత్తు చేస్తూ ఉంది. వైఎస్ జయంతి సంద్భంగా పార్టీని ప్రకటించారు షర్మిల. ఇప్పటికే ఖమ్మంలో సభ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నాయకులతో సమావేశాలు పూర్తయ్యాయి. జిల్లాల పర్యటనలతో వైఎస్ అభిమానులకు దగ్గరయ్యే పనిలో పడ్డారు షర్మిల. పార్టీ ప్రకటన సమయంలోనే పాదయాత్ర గురించి ప్రస్తావించారు. వైఎస్ఆర్ కలలు కన్న.. రాజన్న రాజ్యం కోసం కలిసిరావాలని కోరారు.

ఇక అధికార పార్టీ తన వ్యూహంలో తానుంది. రాజకీయంగా అన్నీ పార్టీలు క్రియాశీలం అవడంతో అధికార పార్టీ కూడా వ్యూహాత్మకంగా పనిచేస్తుంది. అఖిలపక్ష సమావేశంలో దళిత క్రాంతి, సీఎం జిల్లాల పర్యటనలు ఇలా దూకుడు మీదనే ఉంది. ప్రతిపక్ష పార్టీల పాదయాత్రలపై టీఆర్‌ఎస్‌ తనదైన శైలిలో స్పందించింది. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని పాదయాత్రల్లో చూసి రండని సెటైర్లు వేశారు కేటీఆర్. మొత్తానికి తెలంగాణలో ఇన్నాళ్లు స్తబ్దుగా ఉన్న రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ఎన్నికలు దూరంలో ఉన్నప్పటికీ అన్ని రాజకీయ పార్టీలు తన వ్యూహాలకు పదునుపెడుతున్నాయి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-