ప్రభుత్వ వాదన అది.. విపక్ష అభ్యంతరం ఇది.. చివరికి ఏమవుతుంది?

వినాయక చవితి పండగ దగ్గరికొస్తోంది. ఈ తరుణంలో.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు.. రాజకీయంగా విమర్శలు, ప్రతి విమర్శలకు దారి తీస్తున్నాయి. వేడుకలను ఇళ్లల్లోనే జరుపుకోవాలని.. కోవిడ్ కారణంగా ఎక్కువగా జనాలు గుమికూడవద్దని ప్రభుత్వం చెబుతోంది. అందుకే.. ఈ ఆదేశాలు ఇచ్చినట్టు వెల్లడించింది. ఇదే.. బీజేపీ, టీడీపీ నేతల ఆగ్రహానికి కారణమైంది. ఇతర కార్యక్రమాలకు అడ్డు రాని కరోనా.. ఇప్పుడు వినాయక చవితి పండగకే అడ్డు పడుతోందా.. అన్న చర్చ మొదలైంది. ప్రతిపక్ష టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తో పాటు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఇతర నేతలు సైతం ఇదే విషయాన్ని లేవనెత్తుతున్నారు. ప్రభుత్వ తీరును గత రెండు, మూడు రోజులుగా తప్పుబడుతున్నారు. ఇది ఎక్కడికి దారి తీస్తుందో అన్న చర్చ.. అందరిలో ఉత్కంఠను పెంచుతోంది.

రానున్న కాలంలో.. ఇదీ పొలిటికల్ హీట్ క్రియటే చేసేందుకు కచ్చితంగా కారణం అవక తప్పదన్న అంచనాలు విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతున్నాయి. అదే జరిగితే.. ప్రజా సమస్యలు పక్కదారి పట్టే అవకాశాలు ఉంటాయన్న ఆందోళన సైతం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి నాన్చే ధోరణి కనబరచకుండా.. వీలైనంత త్వరగా స్పష్టమైన విధానాన్ని ప్రకటిస్తే మంచిదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ వాదన.. ఎంత వరకూ వెళ్తుందో.. ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ణయం వస్తుందో.. బహిరంగంగా పండగ చేసుకునేందుకు అనుమతి ఇచ్చినా.. ఆంక్షలు ఎలా ఉంటాయో అన్నది.. ఏపీలో చాలామంది ఎదురు చూస్తున్నారు. అంతిమంగా.. ఓ ఆధ్యాత్మిక పండగపై ఎలాంటి వివాదాలు లేకుండా ఉంటే.. మా పూజలేవో మేం చేసుకుంటాం.. అని జనం సైతం చెబుతున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-