మండ‌లిలో మారిన స‌మీక‌ర‌ణాలు.. ఆధిక్యంలోకి వైసీపీ..!

ఆంధ్ర‌ప్రదేశ్ శాస‌న స‌భ‌లో తిరుగులేని మెజార్టీ ఉన్న అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి.. శాస‌న మండ‌లిలో మాత్రం స‌రైన బ‌లం లేదు అనేది నిన్న‌టి మాట‌.. ఎందుకంటే.. మండలిలో సమీకరణాలు మారుతున్నాయి.. ఇప్ప‌టి వ‌ర‌కు ఆధిక్యంలో ఉన్న ప్ర‌తిప‌క్ష టీడీపీ బ‌లం.. ఇవాళ్టి నుంచి త‌గ్గిపోనుంది.. ఇదే స‌మ‌యంలో.. అధికార వైసీపీ బ‌లం పెర‌గ‌నుంది.. ఇవాళ మండలి నుంచి ఎనిమిది మంది ఎమ్మెల్సీలు రిటైర్ కానున్నారు.. అందులో.. ఏడుగురు టీడీపీ స‌భ్యులు కాగా.. ఒక‌రు వైసీపీ స‌భ్యులు.. ఈ ప‌రిణామంతో మండలిలో తెలుగుదేశం పార్టీ బ‌లం 22 నుంచి 15కి ప‌డిపోనుంది.. మ‌రోవైపు.. గవర్నర్‌ కోటాలో తాజాగా నలుగురు వైసీపీ స‌భ్యులు నామినెట్ కావ‌డంతో.. వైసీపీ బ‌లం మండ‌లిలో 17 నుంచి 20కి పెర‌గ‌నుంది.. దీంతో.. శాస‌న స‌భ‌లో ఆమోదం పొందిన బిల్లుల‌కు.. శాస‌న మండ‌లిలోనూ ఎలాంటి అడ్డంకులు లేకుండా.. ఆమోదింప‌జేసుకోవ‌డంలో.. అధికార పార్టీకి ఉన్న అడ్డంకులు అన్నీ తొల‌గిపోనున్నాయి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-