బీజేపీకి ఆ భ‌యం ప‌ట్టుకుందా… అందుకే మార్పులు చేస్తున్నారా?

గుజ‌రాత్‌లో రాజ‌కీయ ప‌రిణామాలు వేగంగా మారుతున్నాయి.  ఇప్ప‌టి వ‌ర‌కు అక్క‌డ బీజేపీ ప్ర‌భుత్వం బ‌లంగానే ఉన్న‌ది. అయితే, ప‌టేల్ వ‌ర్గం నుంచి కొంత వ్య‌తిరేక‌త వ‌స్తుండ‌టంతో దిద్దుబాటు చ‌ర్య‌లు మొద‌లుపెట్టింది బీజేపీ.  ఎన్నిక‌ల్లో ప‌టేల్ వ‌ర్గానికి అత్య‌ధిక ఓటు బ్యాంకు ఉంటుంది.  వీరి ఓట్లే కీల‌కం కావ‌డంతో వీరిని ఆకర్షించేందుకు బీజేపీ ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టింది.  ఇందులో భాగంగానే గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిని మార్పు జ‌రిగిన‌ట్టు స్ప‌ష్టంగా తెలుస్తున్న‌ది.  విజ‌య్ రూపానీ జైన్ వ‌ర్గానికి చెందిన వ్య‌క్తి కావ‌డంతో పాటుగా, క‌రోనా మ‌హ‌మ్మారిని ఎదుర్కొన‌డంతో కొంత ఇబ్బందులు ప‌డ‌టం, రాజ‌కీయ నాయ‌కుల‌కు కాకుండా ఆయ‌న అధికారుల‌కు ఎక్కువ‌గా ప్రాధాన్య‌త ఇస్తుండ‌టంతో ఆయ‌న్ను ప‌క్క‌న పెట్టార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.  పైగా వ‌చ్చే ఏడాది ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో ఎలాగైనా గెల‌చి మ‌రోసారి గుజ‌రాత్‌పై ప‌ట్టు నిలుపుకోవాల‌ని బీజేపీ చూస్తున్న‌ది.  గ‌త ఎన్నిక‌ల్లో ఆ పార్టీ కేవ‌టం 99 స్థానాల్లో మాత్ర‌మే విజ‌యం సాధించింది.  ఇటీవ‌ల జ‌రిగిన ఉపఎన్నిక‌ల్లో బీజేపి విజ‌యం సాధించినా, రాబోయే ఎన్నిక‌లు కీల‌కంగా మార‌డంతో మార్పులు చేప‌ట్టింది.  కాంగ్రెస్‌తో పాటు ఆప్ కూడా క్ర‌మంగా బ‌ల‌ప‌డుతుండ‌టంతో బీజేపీ ప‌టేల్ వ‌ర్గానికి ప్రాధాన్య‌త క‌ల్పిస్తూ నిర్ణ‌యాలు తీసుకునే అవ‌కాశం క‌నిపిస్తున్న‌ది.  

Read: గుడ్‌న్యూస్‌: దిగివ‌స్తున్న వంట‌నూనె ధరలు… ఎంత త‌గ్గ‌నున్నాయంటే…

Related Articles

Latest Articles

-Advertisement-