దేశంలో వీఐపీలకు కరోనా టెన్షన్.. రాజకీయ ప్రముఖులకు కరోనా పాజిటివ్

దేశంలో కరోనా మహమ్మారి ఎవరినీ వదిలిపెట్టడం లేదు. ముఖ్యంగా వరుసబెట్టి వీఐపీలందరూ కరోనా బారిన పడుతున్నారు. పలువురు రాజకీయ ప్రముఖులకు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవుతోంది. తాజాగా బీహార్ సీఎం నితీష్ కుమార్‌కు కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఆయన వైద్యుల సలహా మేరకు ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నారని బీహార్ సీఎంవో వెల్లడించింది. ప్రతి ఒక్కరూ జాగ్రత్త చర్యలు తీసుకోవాలంటూ సీఎం నితీష్ పిలుపునిచ్చారని తెలిపింది. గతవారం నితీష్ కుమార్ నివాసంలో 11 మందికి కరోనా సోకింది. గత మంగళవారం పలువురు మంత్రులు, ఇద్దరు డిప్యూటీ సీఎంలు కూడా కరోనా బాధితుల జాబితాలో చేరారు.

అటు ఇప్పటికే కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కరోనా బారిన పడగా… తాజాగా కేంద్ర బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని… తాను హోం ఐసోలేషన్‌లో ఉంటూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. మరోవైపు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మైకి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. తాను స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నానని కర్ణాటక సీఎం బొమ్మై వెల్లడించారు.

Related Articles

Latest Articles