దొంగలుగా మారిన పోలీసులు.. సీసీ కెమెరాకు చిక్కారు..

దొంగతనం చేసిన వారిని పట్టుకునే పోలీసులే దొంగతనం చేశారు. అవును మీరు వింటున్నది నిజమే. చిత్తూరు జిల్లాలో పోలీసులు దొంగతనానికి పాల్పడ్డారు. సాక్షాత్తు ఓ ఏఎస్‌ఐ చేతివాటం చూపించాడు.. అదీ రోడ్డుపక్కనన ఉన్న ఓ చిన్న దుకాణంలో. రాత్రిళ్లు పెట్రోలింగ్ చేసే సమయంలో బట్టల షాపులోకి వెళ్లి చోరీకి పాల్పడ్డారు.. ఆ దృశ్యాలు సీసీ కె మెరాలో రికార్డు అయ్యాయి. కలెక్టరేట్ కు వెళ్లే దారిలో రోడ్డు పక్కన రెండు బట్టల దుకాణాలున్నాయి. రోజంతా వ్యాపారం చేసి రాత్రిళ్లు బట్టలన్నీ మూట కట్టేస్తారు. కొ న్నిసార్లు లోపలే ఏర్పాటు చేసుకున్న మంచంలో పడుకుంటారు. మరికొన్నిసార్లు దుకాణాన్ని పట్టాలతో మూసేసి పోలీసులు పెట్రోలింగ్ చేస్తుంటారనే నమ్మకంతో ఇళ్లకు వెళ్లిపోతారు. ఇలాగే ఈ నెల 4వ తేదీన ఓ షాపు మూసేసి యజమాని ఇంటికి వెళ్లిపోయాడు. ముందే విషయం తెలుసుకున్నారో… అప్పటికప్పుడు షాపులో ఎవరూ లేని విషయాన్ని గమనించారో.. ఇద్దరు పోలీసులు షాపు బయట స్కూటర్ ఆపి లోపలికి వచ్చారు. ఓ పోలీస్‌ యూనిఫాంలోనే షాపులోకి ప్రవేశించి బట్టల మూట విప్పాడు. ఆ సమయంలో చుట్టుపక్కల ఎవరైనా గమనిస్తున్నారా అని చూశాడు. ఆ తర్వాత రెండు చేతుల నిండా బట్టలు తీసుకుని వెళ్లిపోయాడు.

ఏఎస్‌‌ఐ మూట విప్పి బట్టలు తీసుకునే వరకూ బయట కదలికల్ని గమనిస్తూ మరో పోలీసు ఉన్నాడు. బట్టల్ని తీసుకుని ఇద్దరు కలిసి బైక్‌పై వెళ్లిపోయారు. ఇదంతా షాపు యజమాని లోపల ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డయింది. దొంగతనం జరిగిన ఆరు రోజుల తర్వాత సీసీ కెమెరా వీడియో బయట పడింది. వీడియో ఆధారంగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు షాపు యజమాని. షాపులోకి వెళ్లి బట్టలు తీసుకున్నది ఏఆర్ కానిస్టేబుల్ అని.. బయట కాపలాగా సివిల్ డ్రెస్ లో ఉన్న మరో పోలీసు ఏఆర్ ఏఎస్ఐ అని తెలిసింది. పోలీసులే దొంగతనం చేశారని తెలిస్తే డిపార్టహెంట్‌ ప్రతిష్ట దెబ్బతింటుందని ఉన్నతాధికారులు ఈ విషయాన్ని బయటకు రాకుండా చేశారు.

Related Articles

Latest Articles

-Advertisement-