ప్ర‌ధాని బ్రేక్‌ఫాస్ట్ లొల్లి…కేసులు న‌మోదు…

ఫిన్లాండ్ ప్ర‌ధానిగా స‌నా మారిన్ బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత అనేక దేశంలో అనేక సంస్క‌ర‌ణ‌లు తీసుకొచ్చారు.  దేశాన్ని అభివృద్ధి దిశ‌గా అడుగుతు వేయిస్తున్నారు.  చిన్న వ‌య‌సులోనే బాధ్య‌త‌లు తీసుకున్న స‌నా మారిన్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు.  అయితే, ఇప్పుడు స‌నా మారిన్ కుటుంబం చిక్కుల్లో ప‌డింది.  బ్రేక్‌ఫాస్ట్ కోసం 300 యూరోలు ఖ‌ర్చు అయింద‌ని చూపిస్తూ, ఆ సొమ్మును ప్ర‌భుత్వ ఖజానా నుంచి తీసుకుంటున్నార‌ని, స్థానిక మీడియాలో క‌థ‌నాలు రావ‌డంతో ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు చేశాయి.  ఈ విమ‌ర్శ‌ల‌పై ప్ర‌ధాని స్పందించారు.  ప్ర‌ధానిగా తాను ఎలాంటి సౌక‌ర్యాలు కోరుకొవ‌డంలేద‌ని ఆమె పేర్కోన్నారు.  ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌ల‌తో పోలీసులు కేసులు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. 

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-