భారీగా దొంగనోట్లు స్వాధీనం

ఇటీవల ఫేక్ నోట్లు ఎక్కువ చలామణి అవుతున్నాయని రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా వెల్లడించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా రూ. 500 డినామినేషన్ నోట్లు విపరీతంగా చలామణి అవుతున్నాయని తెలిపింది. రూ.500 ఫేక్ కరెన్సీ ఏకంగా 31.4 శాతం మేర పెరిగిందని చెప్పింది. ఇదిలావుంటే, తాజాగా కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో భారీగా నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దండేలీలో జరిపిన సోదాల్లో రూ.72 లక్షల దొంగ నోట్లు సహా మరో రూ.4.5 లక్షల అసలు నోట్లను పట్టుకున్నారు. ఈ వ్యవహారంలో మహారాష్ట్రకు చెందిన ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠాపై కేసు నమోదు చేయడం సహా వారు వాడిన రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-