సింగరేణి కాలనీ ఘటనలో నిందితుడి కోసం రాష్ట్రవ్యాప్తంగా నాకా బంధీ

సైదాబాద్‌ చిన్నారి అత్యాచారం, హత్యకేసులో నిందితుడు రాజు కోసం వేట కొనసాగుతోంది. ఆరు రోజులు గడుస్తున్నా… అతడి ఆచూకీ లభించలేదు. దీంతో నిందితుడిని పట్టుకునేందుకు 100 మందితో 10 బృందాలను ఏర్పాటు చేశారు పోలీసులు. అతని దగ్గర సెల్‌ఫోన్‌ లేకపోవడంతో… ఆచూకీ కనుక్కోవడం కష్టంగా మారినట్టు తెలుస్తోంది. ఎలాగైనా నిందితుడిని పట్టుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నాకాబందీ నిర్వహిస్తోంది పోలీస్‌శాఖ. ఆర్టీసీ ఉద్యోగులను కూడా అలెర్ట్‌ చేశారు. అన్ని బస్టాండ్‌లు, బస్సుల్లో నిందితుడికి సంబంధించిన పోస్టర్లు అంటించారు. నిందితుడి సమాచారం చెబితే 10 లక్షలు రివార్డు ఇస్తామని కూడా ప్రకటించింది పోలీస్‌శాఖ. ఆచూకీ తెలిపిన వారి వివరాల్ని గోప్యంగా ఉంచుతామని చెప్పారు.

Related Articles

Latest Articles

-Advertisement-