కుప్పం కౌంటింగ్‌ కేంద్రం వద్ద పోలీసుల ఓవరాక్షన్‌

అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ లు ప్రతిష్టాత్మకంగా తీసుకన్న కుప్పం మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ కేంద్రం వద్ద పోలీసులు ఓవరాక్షన్‌ చేశారు. కౌంటింగ్‌ కేంద్రం వద్ద మీడియాపై ఆంక్షలు విధించారు. విజువల్స్‌ తీస్తున్న మీడియా ప్రతినిధులపై కేసులు నమోదు చేస్తామంటూ పోలీసులు బెదిరింపులకు దిగారు. దీంతో పోలీసుల తీరుపై జర్నలిస్టులు మండిపడ్డారు.

Also Read: వివేకా హత్య కేసుపై సంచలన వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే

ఇదే కాకుండా పలు కౌంటింగ్‌ కేంద్రాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కడప జిల్లా రాజాంపేట మున్సిపల్‌ కౌంటింగ్‌ కేంద్రం వద్ద గందోరగోళం నెలకొంది. టీడీపీ అభ్యర్థులను అనుమతించిన పోలీసులు.. ఏజెంట్‌ ఫారాలపై మున్సిపల్‌ అధికారి సీల్‌ లేదని ఏజెంట్లను అనుమతించలేదు. దీంతో టీడీపీ నేతలకు పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

Related Articles

Latest Articles