మాస్కులు ధరించని వారిపై భారీ జరిమానాలు

కరోనా సెకండ్ వేవ్ ముగిసిందని భావిస్తూ చాలా చోట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరు కనిపిస్తుంది. థర్డ్ వేవ్ ముప్పు మొదలైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలను కేంద్రం ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలోనూ కరోనా నిబంధనలను తప్పకుండా పాటించాల్సిందేనని అధికారులు మరోసారి గుర్తుచేస్తున్నారు. అయితే తాజాగా మంచిర్యాల జిల్లాలో.. థర్డ్ వేవ్ దృష్ట్యా డీసీపీ రోడ్డుపై నడుచుకుంటూ ఆ ప్రాంతాల్లో మాస్క్ ధరించని వారిని గుర్తించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. థర్డ్ వేవ్ లో భాగంగా పట్టణంలో మాస్క్ లేకుండా తిరుగుతున్న వారిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని తెలిపారు. వారికి కౌన్సిలింగ్ తో పాటుగా, మరోసారి పట్టుబడితే భారీ జరిమానాలు విధించనున్నట్లు తెలిపారు. ప్రతిరోజు నాలుగు టీంలతో స్పెషల్ డ్రైవ్ ను నిర్వహిస్తామన్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-