గర్భిణీ స్త్రీని కాపాడిన పోలీసులు…

ఆపదలో ఉన్న గర్భవతి మహిళను పోలీసులు కాపాడిన సంఘటన ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. లాక్ డౌన్ కారణంగా గురువారం రాత్రి 9 గంటల సమయంలో వాహనాలు లేక ఇబ్బందిపడ్డా గర్భవతిని కాపాడారు ఎస్ ఆర్ నగర్ పోలీసులు. బోరబండ రాజీవ్ నగర్ కు చెందిన స్వాతి (20).. బోరబండ బస్ స్టాప్ వద్ద పురిటినొప్పులు రాగా అక్కడ ఎటువంటి వాహనాలు లేకపోవడంతో ఇబ్బంది ఎదుర్కొంది స్వాతి. బోరబండ బస్ స్టాప్ లో పోలీస్ పెట్రో కార్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సాయిప్రసాద్, హోంగార్డు శ్రావణ్ ..సకాలంలో స్పందించి ఆ నిలోఫర్ ఆసుపత్రికి స్వాతిని తరలించి కాపాడారు. ఇక హాస్పిటల్ లో తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-