చైన్ స్నాచర్ ను ఎన్ కౌంటర్ చేసిన పోలీసులు…

తమిళనాడు కాంచీపురం జిల్లా శ్రీపెరంబుదూర్​ ప్రాంతంలో చైన్ స్నాచర్ ఎన్ కౌంటర్ ను చేసారు పోలీసులు. అయితే తుపాకీతో కాల్పులు జరిపి స్థానికులను భయాందోళనలకు గురి చేసాడు చైన్ స్నాచర్. శ్రీపెరంబుదూర్​లోని ఓ టోల్​ ప్లాజా వద్ద ఓ 55 ఏళ్ల మహిళ గొలుసును దొంగిలించాడు ఝార్ఘండ్​కు చెందిన ముర్తాసా. బాధితురాలి ఆరుపులతో స్థానికులు నిందితుడిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా కాల్పులకు తెగబడ్డాడు ముర్తాసా. అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా.. వారిపై కూడా ముర్తాసా కాల్పులు జరిపాడు. దాంతో పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో ముర్తాసా మృతి చెందాడు. అయితే ఈ ఘటనలో ముర్తాసా మద్దతు ఇచ్చిన మరో నిందితుడు నయీమ్​ అక్తర్​ను అరెస్ట్​ చేశారు పోలీసులు.

-Advertisement-చైన్ స్నాచర్ ను ఎన్ కౌంటర్ చేసిన పోలీసులు...

Related Articles

Latest Articles