అధికార అహంకారంతో కేసీఆర్‌కు కళ్లు నెత్తికెక్కాయి: బండి సంజయ్

ఉద్యోగ బదీలీల అంశంపై జాగరణకు పిలుపునిచ్చిన బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్‌ తన క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతుండగా మైకుల్ని, కెమెరాలను లాగిన పోలీసులు వారి తీరుపై బండి సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ..నీ కొడుకు వేల మందితో ర్యాలీలు తీస్తే కోవిడ్ నిబంధనలు ఎటు పోయాయి.అధికార అహంకారంతో కేసీఆర్‌కు కళ్లు నెత్తికెక్కాయన్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి పోయే రోజులు దగ్గర పడ్డాయన్నారు. కేసీఆర్ ….నీ అవినీతి సామ్రాజ్యాన్ని బద్దలు కొడతాం. ఎంత ధైర్యం మా పార్టీ కార్యకర్తలపైనే చేయి చేసుకుంటారా? ఖబడ్దార్….. సీఎం నువ్వు జైలుకు పోయే సమయం వచ్చింది. కేసీఆర్… నీకు, నీ కొడుకుకు ఇదే గతి పట్టబోతుంది ఖబడ్దార్ అంటూ బండి సంజయ్‌ హెచ్చరించారు.

Read Also: టీఆర్‌ఎస్‌ గుండాలపై చర్యలు తీసుకోవాలి: రేవంత్‌రెడ్డి

జాగరణను అడ్డుకున్న పోలీసులు బండి సంజయ్‌ను అరెస్టుకు రంగం సిద్ధం చేశారు. బండి సంజయ్ కార్యాలయాన్ని చుట్టుముట్టిన పోలీసులు.ఈ క్రమంలోనే బీజేపీ కార్యకర్తలకు, పోలీసులకు వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులను అడ్డుకున్న కార్యకర్తలను పోలీసులు లాక్కెళ్లారు. జాగరణకు మద్దతు తెలిపేందుకు వచ్చిన బీజేపీ నేత లక్ష్మణ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై బండి సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని ఆయన మండిపడ్డారు.

Related Articles

Latest Articles