పోలీసుల దిగ్బంధంలోకి హుజూరాబాద్…

ప్రస్తుతం పోలీసు దిగ్బంధంలోకి హుజూరాబాద్ వెళ్ళిపోయింది. నియోజకవర్గం చుట్టూ 11 చోట్ల చెక్ పోస్టులు ఏర్పాటు చేసారు. ఆర్డీఓ కార్యాలయంతో పాటు సమస్యాత్మక ప్రాంతాల్ల డ్రోన్ లతో నిఘా పెట్టారు. మంత్రులు హరీష్ రావ్, గంగుల కమలాకర్ వాహనాల సైతం తనిఖీ చేస్తున్నారు. వాహన తనిఖీలు ముమ్మరం చేసి నిన్న ఒక్కరోజే 15 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నారు. నేడు అమావాస్య కావడంతో నామినేషన్లకు ప్రధాన అభ్యర్థులు దూరంగా ఉన్నారు. ఎనిమిదో తేదీన బీజేపీ అభ్యర్థి ఈటల, కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్ నామినేషన్లు వేయనున్నారు. అయితే ఇప్పటికే టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ నామినేషన్ వేసిన విషయం అందరికి తెలిసిందే.

-Advertisement-పోలీసుల దిగ్బంధంలోకి హుజూరాబాద్...

Related Articles

Latest Articles