భార‌త ప్ర‌యాణికుల‌పై మ‌రో దేశం కీల‌క నిర్ణ‌యం…

భార‌త ప్ర‌యాణికుల‌పై మ‌రో దేశం కీల‌క నిర్ణ‌యం...

ఇండియాలో రోజురోజుకు క‌రోనా కేసులు ల‌క్ష‌ల్లో న‌మోద‌వుతున్నాయి.  మ‌ర‌ణాల సంఖ్య వేల‌ల్లో ఉంటోంది.  దీంతో ఇండియా నుంచి వ‌చ్చే ప్ర‌యాణికుల‌పై అనేక దేశాలు ఆంక్ష‌లు విధించాయి.  ఈ జాబితాలో పోలెండ్ కూడా చేరిపోయింది.  ఇండియా నుంచి పోలెండ్‌కు వ‌చ్చే ప్ర‌యాణికుల‌కు క్వారంటైన్ ను త‌ప్ప‌నిస‌రి చేసింది.  14 రోజుల‌పాటు త‌ప్ప‌నిస‌రిగా క్వారంటైన్‌లో ఉండాల‌ని పోలెండ్ ఆరోగ్య‌శాఖ ఆదేశాలు జారీ చేసింది.  ఇటీవ‌లే పోలెండ్ దౌత్య‌వేత్త‌ల కుటుంబం ఇండియా నుంచి పోలెండ్‌కు చేరుకుంది.  పోలెండ్‌కు చేరుకున్న దౌత్య‌వేత్త‌ల కుటుంబానికి క‌రోనా పాజిటీవ్‌గా నిర్ధార‌ణ కావ‌డంతో ఆరోగ్య‌శాఖ ఈ నిర్ణ‌యం తీసుకుంది.  పోలెండ్‌లో ఇండియా వెరియంట్‌లు క‌నిపించాయ‌ని, దీంతో భార‌త ప్ర‌యాణికుల‌పై ఆంక్ష‌లు విధించిన‌ట్టు పోలెండ్ అధికారులు పేర్కోన్నారు. ద‌క్షిణాఫ్రికా, యూకే నుంచి వ‌చ్చే ప్ర‌యాణికుల‌పై కూడా ఈ విధ‌మైన ఆంక్ష‌లు ఉన్న‌ట్టు పోలెండ్ ఆరోగ్య‌శాఖ తెలియ‌జేసింది. 

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-