‘పాయిజన్’ మూవీ ట్రైలర్ లాంచ్

రమణ హీరోగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రూపుదిద్దుకుంటున్న సినిమా ‘పాయిజన్’. రవిచంద్రన్ దర్శకత్వంలో కె. శిల్పిక ఈ సినిమా నిర్మించారు. గురువారం సాయంత్రం ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ప్రోగ్రామ్ హైదరాబాద్ లోని ఏఎంబీ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ, ”ఈ ట్రైలర్ చూస్తుంటే హాలీవుడ్ సినిమా చూసిన భావన కలుగుతోంది. ఈ చిత్ర నిర్మాత గురించి నాకు తెలుసు. సినిమా అంటే ప్రాణం పెడతారు. దర్శకుడు రవిచంద్రన్ మా కాంపౌండ్ వ్యక్తి. హీరో రమణకు మంచి భవిష్యత్తు ఉంది. యూత్ అంతా ఈ మూవీకి బాగా కనెక్ట్ అవుతారనే నమ్మకం ఉంది” అని అన్నారు. నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా తీసినట్టు ట్రైలర్ చూస్తుంటే అర్థమౌతోందని, ట్రైలర్ ను చాలా బాగా కట్ చేశారని నిర్మాత పుప్పాల రమేశ్ చెప్పారు. ఈ మూవీ ట్రెండ్ సెట్టర్ గా నిలిచి, హీరో రమణ, దర్శకుడు రవిచంద్రన్ లకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాలనే ఆకాంక్షను లయన్ సాయివెంకట్ వ్యక్తం చేశారు. హీరో రమణ కు మంచి ఫ్యూచర్ ఉందని, అతను సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని దర్శకుడు రవిచంద్రన్ కితాబిచ్చారు. తమ బ్యానర్ నుండి త్వరలో మరో రెండు సినిమాలు నిర్మించబోతున్నట్టు శిల్పిక తెలిపారు. ఈ చిత్రానికి డిజే నేహాల్ సంగీతం అందించారు.

Related Articles

Latest Articles