మ‌రోసారి జాతినుద్దేశించి ప్ర‌సంగించ‌నున్న ప్ర‌ధాని…

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్న‌ది.  రోజువారి కేసుల సంఖ్య నాలుగు ల‌క్ష‌ల నుంచి ల‌క్ష‌కు దిగివ‌చ్చింది.  వేగంగా వ్యాక్సిన్‌ను ఉత్ప‌తి చేస్తున్నారు.  వ్యాక్సినేష‌న్ ప్ర‌క్ర‌య కూడా వేగంగా సాగుతున్న‌ది. విదేశాల‌కు చెందిన వ్యాక్సిన్‌లు ఇండియాకు రాబోతున్న త‌రుణంలో ప్ర‌ధాని మోడి జాతినుద్దేశించి మాట్లాబోతున్నారు.  ఈరోజు సాయంత్రం 5 గంట‌ల‌కు ప్ర‌ధాని జాతి నుద్దేశించి ప్ర‌సంగించ‌బోతున్నారు.  క‌రోనా మ‌హ‌మ్మారి, వ్యాక్సినేష‌న్ విష‌యంపై కీల‌క ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశం ఉన్న‌ది.  ఇప్ప‌టికే అనేక రాష్ట్రాల్లో లాక్‌డౌన్ అమ‌లు చేస్తున్నారు.  కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్న కార‌ణంగా ఈరోజు నుంచి ఢిల్లీ, మ‌హారాష్ట్రలో అన్‌లాక్ ప్ర‌క్రియను ప్రారంభించారు.  ద‌శ‌ల‌వారీ అన్‌లాక్ విధానాల‌పై కూడా ప్ర‌ధాని మోడి ప్ర‌సంగించే అవ‌కాశం ఉన్న‌ది.  

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-