సీఎంల‌తో ప్ర‌ధాని మోడీ కాన్ఫ‌రెన్స్‌…

దేశంలో క‌రోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న వేళ ప్ర‌ధాని మోడీ ఈరోజు దేశంల‌ని అన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా స‌మావేశం అయ్యారు.  ఈ స‌మావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి కూడా హాజ‌రయ్యారు.  దేశంలో థ‌ర్డ్ వేవ్ దృష్ట్రా రాష్ట్రాలు తీసుకుంటున్న చ‌ర్య‌ల‌పై ఈ సమీక్షా స‌మావేశంలో చ‌ర్చిస్తున్నారు.  వ్యాక్సినేష‌న్ పైకూడా ప్ర‌ధాని రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో చ‌ర్చిస్తున్నారు.  అయితే,  ఈ స‌మావేశానికి మ‌హారాష్ట్ర ముఖ్యమంత్రి హాజ‌రు కాలేదు.  ఆయ‌న స్థానంలో ఆ రాష్ట్ర ఆరోగ్య‌శాఖ మంత్రి హాజ‌ర‌య్యారు.  ఇక‌, తెలంగాణ నుంచి సీఎం కేసీఆర్ ఈ సమీక్షా స‌మావేశాని హాజ‌రు కాలేద‌ని తెలుస్తోంది.  

Read: తమ్ముడి మీద కొండంత ప్రేమను చూపిన మెగా హీరో.. పోస్ట్ వైరల్

థ‌ర్డ్ వేవ్ కార‌ణంగా రోజువారీ కేసులు భారీగా పెరుగుతున్నాయి.  ఈరోజు దేశంలో 2.47 ల‌క్ష‌ల‌కు పైగా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి.  రాబోయే రోజుల్లో కేసులు భారీగా పెరిగే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.  ఇప్ప‌టికే అనేక రాష్ట్రాల్లో నైట్ క‌ర్ఫ్యూలు అమ‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే.  ఈ స‌మావేశంలో ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటారో చూడాలి.  

Related Articles

Latest Articles