వరద సహాయకచర్యలపై జగన్‌కి ప్రధాని మోడీ ఫోన్

ఏపీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫోన్‌ చేశారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, అనంతర పరిస్థితులను ఆరా తీశారు ప్రధాని నరేంద్ర మోడీ. కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల పరిస్థితిని ప్రధానికి వివరించారు జగన్. వరద ప్రభావిత ప్రాంతాల్లో రేపు సీఎం వైయస్‌ జగన్‌ ఏరియల్‌ సర్వే చేయనున్నారు. కడప, చిత్తూరు, నెల్లూరు సహా భారీ వర్ష ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు జగన్. బంగాళా ఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం కారణంగా గత వారం రోజులుగా ఏపీలోని వివిధ జిల్లాల్లో భారీవర్షాలు పడ్డాయి. వాగులు, వంకలు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి.

కడప, చిత్తూరు, నెల్లూరు సహా భారీ వర్ష ప్రభావిత ప్రాంతాలను ఏరియల్‌ సర్వే ద్వారా పరిశీలిస్తారు ముఖ్యమంత్రి జగన్. గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా కడప చేరుకోనున్నారు ముఖ్యమంత్రి జగన్. అక్కణ్నుంచి హెలికాప్టర్‌ ద్వారా వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తారు. ఏరియల్‌ సర్వే అనంతరం రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు ముఖ్యమంత్రి. రేణిగుంట నుంచి గన్నవరం తిరిగి చేరుకోనున్నారు సీఎం జగన్. ఏరియల్‌ సర్వేకు బయలుదేరే ముందు ఆయా జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పరిస్థితిని సమీక్షించనున్నారు సీఎం జగన్.

Related Articles

Latest Articles