రాజ్‌ఘాట్, విజయ్‌ఘాట్‌లో నివాళులర్పించిన మోడీ

రాజ్‌ఘాట్, విజయ్‌ఘాట్‌లో నివాళులర్పించారు ప్రధాని నరేంద్ర మోడీ.. జాతిపిత మహాత్మా గాంధీ 152వ జయంతిని.. భారత రెండో ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రి 117వ జయంతిని పురస్కరించుకుని.. ఇవాళ ఉదయం రాజ్‌ఘాట్‌, విజయ్‌ఘాట్‌లో నివాళులర్పించారు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ.. వారి స‌మాధుల వ‌ద్ద నివాళుల‌ర్పించారు. మరోవైపు.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ స‌హా ప‌లువురు ప్రముఖులు రెండు ఘాట్ల దగ్గర పుష్పాంజ‌లి ఘ‌టించారు. ఇక, ఇద్దరు నేతల జ‌యంతి ఉత్సవాల్లో ఉప రాష్ట్రప‌తి వెంక‌య్య నాయుడు, లోక్‌స‌భ స్పీక‌ర్ ఓం ప్రకాశ్ బిర్లా, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ తదితరులు పాల్గొని దేశానికి గాంధీజీ, శాస్త్రి చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు.

-Advertisement-రాజ్‌ఘాట్, విజయ్‌ఘాట్‌లో నివాళులర్పించిన మోడీ

Related Articles

Latest Articles