యోగా క‌రోనాతో పోరాడే శ‌క్తిని ఇస్తుందిః ప్ర‌ధాని మోడి

జూన్ 21 అంత‌ర్జాతీయ యోగా దినోత్సవం.  ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని మోడి జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించారు.  క‌రోనా వ‌ల్ల తీవ్ర‌మైన ఇబ్బందులు ఎదుర్కోన్నామ‌ని తెలిపారు.  ఈ విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో యోగా ఓ ఆశాకిర‌ణంలా నిలిచింద‌ని, క‌రోనా స‌మ‌యంలోనూ ప్ర‌జలు ఉత్సాహంగా యోగా కార్య‌క్ర‌మంలో పాల్గొంటున్నార‌ని అన్నారు.  

Read: నాని “దారే లేదా” సాంగ్ కు విశేష స్పందన

చాలా పాఠ‌శాల‌లు ఆన్‌లైన్‌లో యోగా క్లాసులు నిర్వ‌హించిన‌ట్టు ప్ర‌ధాని పేర్కొన్నారు.  ఇక నెగిటివిటితో యుద్ధం చేయ‌డానికి యోగా ఉప‌యోగ‌ప‌డుతుందని అన్నారు.  యోగా క‌రోనాతో పోరాడేందుకు కావాల్సిన శ‌క్తిని ఇస్తుంద‌ని ప్ర‌ధాని మోడి ఈ సంద‌ర్భందా తెలిపారు.  2015 నుంచి జూన్ 21 వ తేదీని అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వంగా జ‌రుపుకుంటున్నారు. 

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-