ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నేడు ప్రధాని సమావేశం…

దేశంలో క‌రోనా కేసులు త‌గ్గిన‌ట్టే త‌గ్గి మ‌ర‌లా పెరుగుతున్నాయి.  దేశంలోని 8 రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్న సంగ‌తి తెలిసిందే.  కేర‌ళ‌, మ‌హారాష్ట్ర‌తో పాటుగా అటు ఈశాన్య రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి.  ముఖ్యంగా అస్సాం, అరుణాచ‌ల్‌ప్ర‌దేశ్‌, త్రిపుర‌, మ‌ణిపూర్ రాష్ట్రాల్లో కేసులు పెద్ద సంఖ్య‌లో న‌మోదవుతున్నాయి.  ఇక త్రిపురలో డెల్టాప్ల‌స్ వేరియంట్ కేసుల సంఖ్య క్ర‌మంగా పెరుగుతుండ‌టంతో కేంద్రం అప్ర‌మ‌త్తం అయింది.  

Read: తెలకపల్లి రవి : వరస ఎన్నికలకు బిజెపి ఆరెస్సెస్‌ రెడీ, మోడీ ఇమేజి కోసం మొహాల మార్పు

ఈరోజు ఉద‌యం 11 గంట‌ల‌కు ప్ర‌ధాని మోడి ఆయా రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో స‌మావేశం కానున్నారు.  ఇప్ప‌టికే కేంద్ర‌బృందం ఆయా రాష్ట్రాల్లో ప‌ర్య‌టించి ప‌ర్య‌టించిన సంగ‌తి తెలిసిందే.  థ‌ర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్న నేప‌థ్యంలో ప్ర‌ధాని మోడి స‌మీక్షా స‌మావేశం ప్రాధాన్య‌త సంత‌రించుకున్న‌ది.  కేసుల పెరుగుద‌ల‌పై తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై ప్ర‌ధాని మోడి ముఖ్య‌మంత్రుల‌తో మాట్లాడే అవ‌కాశం ఉన్న‌ది.  

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-