అమెరికా పర్యటనకు ప్రధాని మోడీ..!

భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. సెప్టెంబర్‌ 23 నుంచి అమెరికాలో పర్యటించనున్నారు. కరోనా, తీవ్రవాదంపై ప్రధాని ప్రసంగించడంతోపాటు ఆప్ఘనిస్థాన్‌పై భారత వైఖరిని ప్రకటించే అవకాశం ఉంది. అంతేకాకుండా భద్రతా మండలిలో భారత శాశ్వత సభ్యత్వం గురించి చర్చించనున్నట్టు సమాచారం. ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడు జోబైడన్‌తో మోడీ భేటీ అవుతారని సమాచారం. కరోనా కారణంగా విదేశీ పర్యటనలకు దూరమయ్యారు మోడీ.. ఈ ఏడాది మార్చిలో బంగ్లాదేశ్ లో పర్యటన మినహా ఆయన ఏ ఇతర దేశానికి వెళ్ల లేదు. కరోనా తగ్గుముఖం పట్టిన తరువాత తొలి పర్యటనగా ఇప్పుడు అమెరికాకు వెళ్లనున్నారు. మూడు రోజుల పాటు పర్యటన సాగనుంది.

ఈ నెల 22వ తేదీన ప్రధాని మోడీ.. ఢిల్లీ నుంచి వాషింగ్టన్ బయల్దేరుతారు. 23న అమెరికా అధ్యక్షడు జో బైడెన్ తో ద్వైపాక్షిక చర్చలు నిర్వహిస్తారు. కరోనా పరిస్థితులు.. ఆర్థిక అంశాలతో పాటుగా.. తీవ్రవావాదం.. ఆఫ్ఘనిస్తాన్ లో చోటు చేసుకున్న తాజా పరిణాలపైన చర్చించే అవకాశం ఉంది. 24న వాషింగ్టన్ లో జరిగే క్వాడ్ సమావేశంలో పాల్గొంటారు మోడీ… ఆ సమావేశంలో మోడీతో పాటుగా అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని మారిసన్, జపాన్ ప్రధాని యోషిదే సుగా ప్రసంగించనున్నారు. ఇక, 25న న్యూయార్క్ లో జరిగే కీలకమైన 76వ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ప్రధాని పాల్గొని ప్రసంగిస్తారు. ఐక్యరాజ్య సమితి ఆ సమావేశంలో మాట్లాడే స్పీకర్ల జాబితా విడుదల చేసింది. దీంతో.. ప్రధాని చేసే ఆ ప్రసంగం పైన ఆసక్తి నెలకొంది.

Related Articles

Latest Articles

-Advertisement-