కోవిడ్‌ను అర్థం చేసుకోలేదు.. వ్యాక్సినేష‌న్ స‌రిగాలేదు..!

ఓవైపు క‌రోనా విజృంభ‌ణ‌, మ‌రోవైపు వ్యాక్సిన్ల కొర‌త‌పై సీరియ‌స్‌గా స్పందించారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.. ప్రధాని మోడీ, కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన ఆయ‌న‌.. ప్ర‌ధాని మోడీ గానీ, కేంద్రం గానీ క‌రోనా సమస్యను సరిగా అర్ధం చేసుకోలేకపోయిందని మండిప‌డ్డారు.. కోవిడ్ కేవలం ఒక డిసీజ్ మాత్రమే కాదని.. విస్త‌రిస్తోన్న వ్యాధి అని, దానికి తగినంత సమయం, అవకాశం ఇస్తే మృత్యు ఘంటికలు మోగిస్తుంద‌న్నారు రాహుల్.. మ‌రోవైపు వ్యాక్సినేష‌న్‌పై మాట్లాడుతూ.. వ్యాక్సిన్ పంపిణీపై ప్ర‌భుత్వం దృష్టిసారించి ఉంటే.. స‌రైన ప్లాన్ అమ‌లు చేస్తే.. క‌రోనా సెకండ్ వేవ్ చవిచూడాల్సి రాక‌పోవు అన్నారు. ఇక‌, లాక్‌డౌన్.. క‌రోనా క‌ట్ట‌డికి ఉప‌యోగప‌డుతుంది.. కానీ, లాక్‌డౌన్, భౌతిక దూరం పాటించడం, మాస్క్‌లు ధరించడం.. కోవిడ్‌పై పోరాటంలో కేవ‌లం తాత్కాలిక వ్యూహాలు మాత్ర‌మే అన్నారు. కరోనాను తరిమికొట్టాలంటే దేశ‌ ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇవ్వడమే ఏకైక మార్గం అన్నారు రాహుల్ గాంధీ.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-