సీక్రెట్‌గా మూడో పెళ్లి చేసుకున్న బ్రిటన్ ప్రధాని

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రహస్యంగా మూడో పెళ్లి చేసుకున్నారు. తన ఫియన్సీ క్యారీ సైమండ్స్ ను జాన్సన్ పెళ్లి చేసుకున్నారు. శనివారం రోజున లండన్ లోని వెస్ట్ మినిస్టర్ రోమన్ క్యాథలిక్ క్యాథడ్రల్‌లో ఈ వివాహ కార్యక్రమం ముగిసింది. బోరిస్ జాన్సన్ రహస్యంగా పెళ్లి చేసుకున్నారని అక్కడి మీడియా పేర్కొంది. దీనిపై బోరిస్ జాన్సన్ అధికారిక కార్యాలయం 10 డౌనింగ్ స్ట్రీట్ ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. దీనిపై మాట్లాడటానికి మీడియా నిరాకరించినట్లు మీడియా తెలిపింది. కాగా ప్రధాని బోరిస్ జాన్సన్ కు ఇది వరకే రెండు సార్లు పెళ్లి అయింది. న్యాయవాది మెరినా వీలర్ ను ఆయన రెండో పెళ్లి చేసుకున్నారు. 2018 సెప్టెంబర్ లో బోరిస్ జాన్సన్, వీలర్ విడిపోయారు. ఆ తర్వాత 2019లో జాన్సన్..క్యారీ సైమండ్స్ తో సహజీవనం ఆరంభించారు. వారికి ఓ కుమారుడు ఉన్నాడు. బ్రిటన్‌లో అధికారంలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీలో సైమండ్స్ క్రియాశీలకంగా పనిచేస్తోన్నారు. అయితే తాజాగా క్యారీ సైమండ్స్ ను పెళ్లి చేసుకున్నారు బోరిస్ జాన్సన్. ఈ వివాహం చాలా రహస్యంగా జరగడం విశేషం.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-