కూలిన విమానం.. 16 మంది మృతి

విమాన ప్రమాదంలో ఏకంగా 16 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన రష్యాలో జరిగింది… ఎల్ -410 టర్బోలెట్ విమానం రష్యాలోని టాటర్‌స్థాన్‌లో ఇవాళ కుప్పకూలిపోయింది.. ప్రమాదసమయంలో విమానంలో 23 మంది ప్రయాణికులు ఉండగా.. ఉదయం 9.11 గంటలకు ఈ ప్రమాదం జరిగింది.. విమాన ప్రమాదంలో 16 మంది మరణించినట్లు అత్యవసర మంత్రిత్వ శాఖ వెల్లడించింది.. ఈ ఘటనలో మరో ఆరుగురు వ్యక్తులను కాపాడారు.. ఇక, రష్యా విడుదల చేసిన ప్రమాదానికి సంబంధించిన చిత్రాల ప్రకారం.. విమానం తీవ్రంగా దెబ్బతింది, సగానికి విరిగిపోయింది.. ప్రాణాలతో బయటపడిన ఆరుగురు ఆసుపత్రిలో ఉన్నారని స్థానిక ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.. ఆ విమానం వాలంటరీ సొసైటీ ఫర్ అసిస్టెన్స్ ఫర్ ఆర్మీ, ఏవియేషన్ మరియు నేవీ ఆఫ్ రష్యాకు చెందినది, ఇది తనను తాను స్పోర్ట్స్ మరియు డిఫెన్స్ ఆర్గనైజేషన్‌గా ప్రకటించింది..

-Advertisement-కూలిన విమానం.. 16 మంది మృతి

Related Articles

Latest Articles