విద్యా సంస్థల్లో ప్రత్యక్ష బోధనపై టీఎస్ హైకోర్టులో పిల్…

టీఎస్ హైకోర్టులో విద్యా సంస్థల్లో ప్రత్యక్ష బోధనపై పిల్ నమోదయ్యింది. ప్రైవేట్ ఉపాధ్యాయుడు బాలకృష్ణ హైకోర్టులో పిల్ దాఖలు చేసారు. ప్రి ప్రైమరీ, ప్రైమరీ తరగతులకు ప్రత్యక్ష బోధన ఆందోళన కలిగిస్తోందన్నారు పిటిషనర్. కరోనా మూడో దశ ముప్పు ఉన్నందున ప్రత్యక్ష బోధన సరికాదన్నారు పిటిషనర్. ప్రభుత్వం ఎలాంటి గైడ్ లెన్స్ లేకుండా విద్యా సంస్థలు ప్రారంభించడాన్ని సవాలు చేసారు పిటీషనర్. దాంతో ప్రభుత్వ ఉత్తర్వులను నిలిపివేయాలని హైకోర్టును కోరారు పిటిషనర్. అయితే నేడు పిటీషన్ పై విచారించనుంది తాత్కాలిక సీజే జస్టిస్ రామచంద్రరావు ధర్మాసనం. అయితే కరోనా కారణంగా గత ఏడాదిన్నరగా మూసి ఉన్న విద్య సంస్థలు సెప్టెంబర్ 1 అంటే రేపటి నుండి తెరుచుకోనున్నాయి.

Related Articles

Latest Articles

-Advertisement-