కాళేశ్వరం ప్రాజెక్టు పై హైకోర్టులో పిల్..!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌ ప్రారంభం అయినప్పటి నుంచి.. ఎదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది. అయితే.. తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీ పనుల పై హైకోర్టులో పిల్ దాఖలైంది. సిద్ధిపేట జిల్లా తుక్కాపూర్ కు చెందిన శ్రీనివాస రెడ్డి పిల్ దాఖలు చేశారు. మూడో టీఎంసీకి అనుమతుల్లేకుండా పనులు చేపట్టారని పిల్‌ పేర్కొన్నాడు పిటిషనర్ శ్రీనివాస రెడ్డి. కేంద్రం, ఎన్జీటీ ఆదేశాలకు విరుద్ధంగా పనులు చేస్తున్నారని హై కోర్టు విన్నవించారు పిటిషనర్. అయితే… కాళేశ్వరం మూడో టీఎంసీ పనుల పై పిల్ విచారణకు స్వీకరించింది హైకోర్టు. కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పనులు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు మాత్రం హైకోర్టు నిరాకరించింది. ఇక ఈ కేసు విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు.

-Advertisement-కాళేశ్వరం  ప్రాజెక్టు పై హైకోర్టులో పిల్..!

Related Articles

Latest Articles