మళ్లీ పెరిగిన పెట్రో ధరలు

పెట్రో ధరలు వరుసగా పెరిగిపోతూనే ఉన్నాయి… పెట్రో భారం ప్రత్యక్ష, పరోక్షంగా ప్రజల నడ్డి విరిస్తూనే ఉంది.. రోజువారీ సమీక్షలో భాగంగా ఇవాళ దేశీయ చమురు కంపెనీలు లీటర్‌ పెట్రోల్‌పై 30 పైసలు పెంచేశాయి.. దీంతో.. ఢిల్లీలో లీటర్‌ ప్రెటోల్‌ ధర రూ.101.84కి చేరగా.. డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశ రాజధానిలో లీటర్‌ డీజిల్‌ ధర రూ.89.87గా ఉంది.. 75 రోజుల్లో 41వ సారి పెట్రో ధరలను వడ్డించాయి చమురు సంస్థలు.. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు ఇలా ఐదు మెట్రో సిటీల్లో ఇప్పటికే పెట్రోల్ ధర సెంచరీ దాటేసింది.

ముంబైలో ఒక లీటర్ పెట్రోల్ ధర రూ.107.83గా, లీటర్‌ డీజిల్‌ ధర రూ. 97.45గా ఉంది.. రాజస్థాన్‌లో అయితే.. లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.113.21గా ఉంట.. డీజిల్ ధర రూ.103.15గా ఉంది.. కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.102.08, డీజిల్‌ రూ.93.02, చెన్నైలో పెట్రోల్‌ రూ.102.49, డీజిల్‌ రూ.94.39, జైపూర్‌లో పెట్రోల్‌ రూ.108.71, డీజిల్‌ రూ.99.02, హైదరాబాద్‌లో పెట్రోల్‌ రూ.105.83, డీజిల్‌ రూ.97.96గా ఉన్నది. ఇక, గుంటూరులో లీటర్‌ పెట్రోల్‌ రూ.108.6, డీజిల్‌ రూ.99.65గా ఉంటే.. విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ రూ.107.86గా.. లీటర్‌ డీజిల్‌ ధర రూ.99.45గా ఉంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-