మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

దేశంలో గత కొన్ని రోజులుగా పెట్రోల్‌ ధరలు సామాన్య ప్రజలకు చుక్కలు చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఇవాళ తాజాగా మరోసారి పెట్రోల్‌ ధరలు పెరిగిపోయాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ పై 30 పైసలు, లీటర్ డీజిల్ పై 35 పైసలు పెరిగింది. ఈ పెరుగుదలతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 103.24 చేరగా.. లీటర్ డీజిల్ ధర రూ. 91.77 కు చేరింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 109 . 25 చేరగా.. డీజిల్ ధర రూ.99. 55 కు చేరింది. ఇక హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 107. 40 చేరగా.. డీజిల్ ధర రూ. 100. 13 కు చేరింది. ఇటు ఏపీలోని కొన్ని జిల్లాల్లో పెట్రోల్ ధరలు సెంచరీ కొట్టిన సంగతి తెలిసిందే. విజయవాడ విషయానికి వస్తే లీటర్ పెట్రోల్ ధర రూ.109. 60 కు చేరగా.. డీజిల్ ధర రూ. 101. 74 కు చేరింది.

-Advertisement-మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

Related Articles

Latest Articles