వాహనదారులపై పిడుగు : మరోసారి పెరిగిన పెట్రోల్ ధరలు

కరోనా కేసులు విలయం కొనసాగుతున్న నేపథ్యంలో.. పెట్రో ధ‌ర‌లు పెరుగుదల సామాన్యుడికి చుక్క‌లు చూపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో సెంచ‌రీ కూడా దాటేశాయి.. కానీ, ఎప్పుడైతే నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌ల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నిక‌ల సంఘం విడుద‌ల చేసిందో.. అప్ప‌టి నుంచి ఆగిపోయాయి.. కొన్ని సార్లు త‌గ్గాయి త‌ప్పితే.. పెరిగింది మాత్రం లేదు.. అయితే, తాజాగా వాహనదారులకు పెట్రోల్ ధరలు షాక్ ఇచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ పై 28 పైసలు, లీటర్ డీజిల్ పై 26 పైసలు పెరిగింది. ఈ పెరుగుదలతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 93.94 చేరగా.. లీటర్ డీజిల్ ధర రూ. 84.89 కు చేరింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో సెంచరీకి చేరింది. లీటర్ పెట్రోల్ ధర రూ. 100.19 చేరగా.. డీజిల్ ధర రూ. 92.17 కు చేరింది. ఇక హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 97.63 చేరగా.. డీజిల్ ధర రూ. 92.54 కు చేరింది. ఇటు ఏపీలోని కొన్ని జిల్లాల్లో పెట్రోల్ ధరలు సెంచరీ కొట్టిన సంగతి తెలిసిందే. విజయవాడ విషయానికి వస్తే లీటర్ పెట్రోల్ ధర రూ. 100.11గా నమోదైంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-