ఇవాళ కూడా పెరిగిన పెట్రో ధరలు

ఆల్‌టైం హైకి చేరిన పెట్రో ధరలు.. కొన్ని రోజుల పాటు స్థిరంగా కొనసాగాయి.. కానీ, మళ్లీ వరుసగా మూడు రోజుల నుంచి పెరుగుతూ పోతున్నాయి.. ఇవాళ లీటర్‌ పెట్రోల్‌పై 25 పైసలు, డీజిల్‌పై 30 పైపలు పెరిగింది.. దీంతో.. ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.102.14కు చేరగా.. లీటర్‌ డీజిల్‌ ధర రూ.90.48గా పలుకుతుంది. ఇక, ముంబైలో పెట్రోల్‌ ధర రూ.108.15కు పెరగగా.. డీజిల్‌ ధర రూ.98.12గా ఉంది. మరోవైపు, అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా చమురు ధరలు పెరుగుతున్నాయి.. కాగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎప్పుడో సెంచరీ కొట్టాయి పెట్రోల్ ధరలు.. పలు ప్రాంతాల్లో డీజిల్‌ ధర కూడా వంద దాటిపోయింది.. ఇక, పెట్రో ధరలు పెరగడంతో.. క్రమంగా ఇతర వస్తువులపై భారం పడుతోందనే ఆందోళన వ్యక్తం అవుతోంది.

-Advertisement-ఇవాళ కూడా పెరిగిన పెట్రో ధరలు

Related Articles

Latest Articles