ఆరని పెట్రో మంటలు.. ఈ రోజు కూడా పెరిగిన ధరలు

రోజురోజుకీ పెరుగుతోన్న పెట్రో ధరలు సామాన్యుడికి భారంగా మారుతూనే ఉన్నాయి.. అయినా, చమురు కంపెనీల రోజువారి వడ్డింపు ఆగడం లేదు.. కాస్త బ్రేక్‌ తర్వాత మళ్లీ పెరుగుతోన్న పెట్రో ధరలు.. వరుసగా ఏడో రోజు కూడా పైకి ఎగబాకాయి.. తాజాగా లీటరు పెట్రోల్‌పై 30 పైసలు, డీజిల్‌పై 35 పైసలు వడ్డించాయి చమురు సంస్థలో దీంతో.. దేశ రాజధాని ఢిల్లీలో చమురు ధరలు ఆల్‌టైం హైకి చేరి కొత్త రికార్డు సృష్టించాయి.. ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.104.44కు చేరగా, డీజిల్‌ రూ.93.17కు పెరిగింది. ఇక, ముంబైలో పెట్రోల్‌ రూ.110.41, డీజిల్‌ రూ.101.03కి ఎగబాకింది.. మరోవైపు.. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్‌పై 31 పైసలు, డీజిల్‌పై 38 పైసలు పెరగడంతో.. పెట్రోల్‌ ధర రూ.108.64కు, డీజిల్‌ ధర రూ.101.65కు ఎగిసింది.

-Advertisement-ఆరని పెట్రో మంటలు.. ఈ రోజు కూడా పెరిగిన ధరలు

Related Articles

Latest Articles