మరోసారి పెరిగిన పెట్రో ధరలు

చమురు కంపెనీలు ఆదివారం మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. దీనివల్ల సామాన్యుల ఇబ్బంది మరింత పెరిగింది. క్షీణిస్తున్న ఆదాయం మధ్య సామాన్యులు ఇప్పటికే ద్రవ్యోల్బణంతో పోరాడుతున్నారు. దేశ రాజధానిలో పెట్రోల్ రిటైల్ ధర 35 పైసలు పెరిగి లీటరుకు 99.51 రూపాయలకు చేరుకుంది. అదే సమయంలో, లీటరుకు 18 పైసలు పెరిగిన తరువాత డీజిల్ రూ.89.36కు చేరింది. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌పై 36 పైసలు, డీజిల్‌పై 20 పైసలు పెరగడంతో.. పెట్రోల్‌ ధర రూ.103.41కు, డీజిల్‌ ధర రూ. 97.40కు చేరింది.

దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పరిశీలిస్తే.. ముంబైలో పెట్రోల్- 105.58, డీజిల్- లీటరుకు 96.91గా ఉండగా.. లక్నోలో పెట్రోల్- 96.65, డీజిల్- లీటరుకు 89.75కి పెరిగింది. గురుగ్రామ్‌లో పెట్రోల్- 97.20, డీజిల్- లీటరుకు 89.96గా ఉంది.. చండీగడ్‌లో పెట్రోల్‌ లీటర్‌కు 95.70, డీజిల్ 89.00గా ఉంది.. నోయిడాలో పెట్రోల్‌ 96.76, డీజిల్- 89.83గా.. బెంగళూరులో పెట్రోల్- 102.84, డీజిల్- లీటరుకు 94.72గా.. పాట్నాలో పెట్రోల్- 101.62, డీజిల్- 94.76గా.. హైదరాబాద్‌లో లీటరుకు 103.41, డీజిల్- లీటరుకు 97.40గా.. జైపూర్‌లో పెట్రోల్- 106.27, డీజిల్- 98.47కి పెరిగింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని నగరాలు మరియు పట్టణాల్లో లీటర్‌ పెట్రోల్‌ ఎప్పుడో సెంచరీ దాటేయగా.. డీజిల్‌ కూడా కొన్ని ప్రాంతాల్లో సెంచరీ పూర్తిచేసింది.

-Advertisement-మరోసారి పెరిగిన పెట్రో ధరలు

Related Articles

Latest Articles