ఆగ‌ని పెట్రో బాదుడు.. మే నుంచి 27వ సారి వ‌డ్డింపు..

పెట్రో బాదుడు కొన‌సాగుతూనే ఉంది.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో.. పెట్రో ధ‌ర‌ల‌కు బ్రేక్ ప‌డింది.. ఇక‌, ఆ త‌ర్వాత మే 4వ తేదీ నుంచి వ‌రుస‌గా పెరుగుతూ పోతున్నాయి చ‌మురు ధ‌ర‌లు.. ఇప్ప‌టి వ‌ర‌కు 27 సార్లు వ‌డ్డించాయి చ‌మురు కంపెనీలు.. ఇక‌, ఇవాళ పెట్రోల్‌, డీజిల్‌ ధరలను మ‌రింత పెంచారు.. లీట‌ర్ పెట్రోల్‌పై 27 పైస‌లు, లీట‌ర్ డీజిల్‌పై 30 పైస‌ల చొప్పున పెంచాయి ఆయిల్ సంస్థ‌లు.. తాజా వ‌డ్డింపుతో క‌లిపి హైద‌రాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర‌ రూ.100.74కి చేర‌గా.. లీట‌ర్ డీజిల్ ధ‌ర రూ.95.60గా ప‌లుకుతోంది. ఇక‌, విజ‌య‌వాడ‌లో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.102.93కి ప‌రుగులు పెట్ట‌గా.. లీట‌ర్ డీజిల్ ధ‌ర రూ.97.17కు ఎగ‌బాకింది.. ఇప్ప‌టికే దేశ‌వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో పెట్రోల్ సెంచ‌రీ కొట్టేసింది.. డీజిల్ కూడా సెంచ‌రీ వైపు ప‌రుగులు తీస్తోంది.. ఇక‌, రాజ‌స్థాన్‌లోని శ్రీ‌గంగాన‌గ‌ర్‌లో ఇప్ప‌టికే సెంచ‌రీ దాటి రూ.100.82కు చేరింది లీట‌ర్ డీజిల్ ధ‌ర‌.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-