పింఛన్ల దరఖాస్తు గడువు మళ్లీ పొడిగింపు..

పింఛన్ల దరఖాస్తు గడువును మళ్లీ పొడిగించింది తెలంగాణ ప్రభుత్వం… గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 57 ఏళ్లు నిండిన పేదలందరికీ ఆసరా వృద్ధాప్య పింఛన్లు అందించడానికి సిద్ధం అవుతుతోన్న సర్కార్.. అందులో భాగంగా ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని చేపట్టింది.. ప్రభుత్వం పెట్టిన గడువు ప్రకారం.. గత నెలలోనే గడువు ముగిసిపోగా.. మరో అవకాశం కల్పించాలని అధికారులను ఆదేశాలు జారీ చేశారు సీఎస్‌ సోమేష్‌ కుమార్‌.. మీసేవ కేంద్రాల్లో ఈ నెల 11వ తేదీ నుంచి 30వ తేదీవరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని.. దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. కాగా, వృద్ధాప్య పింఛన్ల్ల అర్హత 57 ఏళ్లకు తగ్గించినా అర్హులైన చాలామంది దరఖాస్తు చేసుకోలేకపోయారని.. మొన్న అసెంబ్లీ సమావేశాల్లో పలువురు ఎమ్మెల్యేలు ఈ విషయాన్ని లేవనెత్తారు.. దీంతో. సీఎం కేసీఆర్‌ సూచనల మేరకు సమీక్ష నిర్వహించి సీఎస్.. మరోసారి దరఖాస్తులకు అవకాశం కల్పించాలని ఆదేశించారు.

-Advertisement-పింఛన్ల దరఖాస్తు గడువు మళ్లీ పొడిగింపు..

Related Articles

Latest Articles