‘ట్రిపుల్ ఆర్’ విషయంలో పుకార్లు నమ్మొద్దంటున్న పెన్ స్టూడియోస్!

స్టార్ హీరోల సినిమాలు సైతం ఈ పేండమిక్ సిట్యుయేషన్ లో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండటంతో వారి అభిమానుల మనసుల్లో రకరకాల సందేహాలు తలెత్తుతున్నాయి. అలానే ఎగ్జిబిటర్స్ సైతం ఒకవేళ భారీ మొత్తం చెల్లించేసిన తర్వాత భారీ బడ్జెట్ చిత్రాలు ఓటీటీ బాట పడితే… తమ పరిస్థితి ఏమిటనే సందిగ్థంలో పడిపోతున్నారు. ఈ నేపథ్యంలో పెన్ స్టూడియోస్ ‘ట్రిపుల్ ఆర్’ మూవీకి సంబంధించి ఓ క్లారిఫికేషన్ ను ఇచ్చింది.

Read Also : సినిమా థియేటర్ల ఆన్ లైన్ టికెట్ బుకింగ్ లోకి ఏపీ ప్రభుత్వం!

థియేటర్లను దృష్టిలో పెట్టుకునే తీసిన మేగ్నమ్ ఓపస్ మూవీ ‘ట్రిపుల్ ఆర్’ ను ఓటీటీలో విడుదల చేసే ప్రసక్తే లేదని, అలాంటి పుకార్లను నమ్మవద్దని కోరింది. అంతేకాదు… అలియాభట్ నాయికగా నటించిన ‘గంగూభాయ్ కతియవాడి’, జాన్ అబ్రహం ‘ఎటాక్’ చిత్రాలను సైతం థియేటర్లలోనే రిలీజ్ చేస్తామని స్పష్టం చేసింది. థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ కోసమే ఈ మేగ్నమ్ ఓపస్ మూవీస్ ను నిర్మించామని, అందుకే థియేటర్లలో కంటే ముందు ఓటీటీలో స్ట్రీమింగ్ చేసే ప్రసక్తే లేదని పెన్ స్టూడియోస్ అధినేత జయంతీలాల్ గడా తెలిపారు.

'ట్రిపుల్ ఆర్' విషయంలో పుకార్లు నమ్మొద్దంటున్న పెన్ స్టూడియోస్!

Related Articles

Latest Articles

-Advertisement-