ఓటిటిలో ఆ హీరో కొడుకు సందడి చేయబోతున్నాడా?

‘పెళ్లిసందడి’ చిత్రానికి సీక్వెల్ గా ‘పెళ్లి సందD’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా కనిపించబోతున్నాడు. ఈ చిత్రానికి రాఘవేంద్రరావు దర్శకత్వం వహించడం లేదు. కేవలం దర్శకత్వ పర్యవేక్షణ మాత్రమే చేపట్టనున్నారు. అంతేకాదు ఈ సినిమాలో రాఘవేంద్రరావు కీ రోల్ లో కనిపిస్తున్నాడు. ఈ సినిమాను కొత్త దర్శకురాలు గౌరి రోనక్ చిత్రీకరించనున్నారు. హీరో రోషన్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ‘పెళ్లి సందడి’కి అద్భుతమైన సంగీతం అందించిన కీరవాణి ఈ సినిమాకి కూడా మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన రెండు సాంగ్స్ కు అద్భుతమైన స్పందన వస్తోంది. అయితే తాజాగా టాలీవుడ్ సర్కిల్స్ లో విన్పిస్తున్న వార్తల ప్రకారం ఈ చిత్రం కూడా ఓటిటిలోనే విడుదల కావడానికి సిద్ధమవుతోందట. ఈ మేరకు మేకర్స్ సినిమా ప్రీమియర్ రైట్స్ డీల్ కుదుర్చుకోవడానికి ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫామ్‌తో చర్చలు జరుపుతున్నారట. ఈ ఊహాగానాలపై చిత్రబృందం స్పందించాల్సి ఉంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-