కేసీఆర్ తీసుకునే నిర్ణయాలు పేద ప్రజల కోసం కాదు…

ప్రభుత్వం భూముల మార్కెట్ విలువ పెంచుతూ జీఓ విడుదల చేశారు. రిజిస్ట్రేషన్ చార్జీలను స్టాంప్ డ్యూటీ పెంచారు. ప్రభుత్వానికి భూముల మార్కెట్ విలువ పెంచడం ద్వారానే ఆదాయం వస్తుంది. కానీ మళ్ళీ రిజిస్ట్రేషన్ చార్జీలను స్టాంప్ డ్యూటీ ఎందుకు పెంచారు అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. దీనివల్ల సామాన్య ప్రజల పై ఆర్థిక భారం పడుతుంది. పెంచిన రిజిస్ట్రేషన్ చార్జీలను స్టాంప్ డ్యూటీ చార్జీలు వెంటనే తగ్గించాలి.

తెరాస అధికారం లోకి వచ్చాక ఎందుకు భూముల మార్కెట్ విలువ పెంచలేదు. ప్రతి ఆరు నెలలకు ఒక సారి భూముల మార్కెట్ విలువ పెంచాలని ఉన్నా ఎందుకు పెంచలేదు అని ప్రశ్నించారు. ఇన్ని రోజులు ప్రాజెక్ట్ ల పేరుతో పేద రైతుల నుంచి వేల ఎకరాలు సేకరించారు. ఇప్పుడు అంతా అయ్యాక భూముల మార్కెట్ విలువ పెంచారు. ముందే భూముల మార్కెట్ విలువ పెంచి ఉంటే పేద ప్రజలు ఆర్థికంగా లబ్ది పొందేవారు. పేద రైతుల వద్ద కోకాపేట భూములు లాక్కొని దళితుల సంక్షేమం కోసమే అని చెప్పడం సిగ్గు చేటు. కేసీఆర్ చేసే చర్యలు .. తీసుకునే నిర్ణయాలు పేద ప్రజల కోసం కాదు. కేసీఆర్ కు లోపల వేరే ఈడెన్ ఎజెండా ఉంటుంది అని పేర్కొన్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-