పాక్ జ‌ట్టుకు బంప‌ర్ ఆఫ‌ర్‌: ఇండియాను ఓడిస్తే…

అక్టోబ‌ర్ 17 వ తేదీ నుంచి యూఏఈ వేదికగా టీ 20 ప్ర‌పంచ క‌ప్ పోటీలు జ‌ర‌గ‌బోతున్నాయి.  ఇందులో భాగంగా ఈనెల 24 వ తేదీన ఇండియా-పాక్ జ‌ట్ల మ‌ధ్య టీ 20 మ్యాచ్ జ‌ర‌గ‌బోతున్న‌ది.  ఈ మ్యాచ్ కోసం ప్ర‌పంచం మొత్తం ఎదురుచూస్తున్న సంగ‌తి తెలిసిందే.  ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెల‌వాల‌ని ఇరు దేశాల జ‌ట్లు ప్ర‌య‌త్నం చేస్తుంటాయి.  ఇప్ప‌టి వ‌ర‌కు ఇండియా-పాక్‌లో 6సార్లు త‌ల‌ప‌డ‌గా 5 సార్లు ఇండియా విజ‌యం సాధించింది.  ఒక మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా ఆగిపోయింది.  కాగా దుబాయ్ వేదిక‌గా ఈనెల 24 వ తేదీన మ‌రోసారి రెండు జట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి.  ఈ మ్యాచ్‌లో ఇండియాపై పాక్ విజ‌యం సాధిస్తే పాక్ ఆట‌గాళ్ల‌కు బ్లాంక్ చెక్కులు ఇస్తామ‌ని పాక్ క్రికెట్ బోర్డు చైర్మ‌న్ ర‌మీజ్ రాజా ప్ర‌క‌టించారు.  అంతేకాకుండా పాక్ ప‌ర్య‌ట‌న‌ను అర్థాంత‌రంగా ముగించుకొని వెళ్లిన న్యూజిల్యాండ్‌కు కుడా టీ 20 ద్వారా బుద్ధి చెప్పాల‌ని రమీజ్ రాజా పేర్కొన్నారు.  ఇక బీసీసీఐ పై కూడా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.  ఐసీసీకి 90 శాతం నిథుల‌ను బీసీసీఐ స‌మ‌కూరుస్తోంద‌ని, ఐసీసీకి ఇండియా నుంచి నిధులు స‌మ‌కూర‌కుంటే పీసీసీ కుప్ప‌కూలిపోతుందని అన్నారు.  

Read: వ్యాక్సిన్ వేయించుకుంటే వాషింగ్ మిషిన్ ఫ్రీ…

-Advertisement-పాక్ జ‌ట్టుకు బంప‌ర్ ఆఫ‌ర్‌:  ఇండియాను ఓడిస్తే...

Related Articles

Latest Articles