వైల్డ్ థింగ్స్ … ప్రియుడితో పాయల్ రొమాంటిక్ పిక్ వైరల్

పాయల్ రాజ్ పుత్ ఒకే ఒక్క సినిమాతో టాలీవుడ్ లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఆమె కేవలం సినిమాల్లో గ్లామర్ పరంగానే కాకుండా రియల్ లైఫ్ రొమాన్స్ గురించి కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి దిగిన పిక్ ఒకటి వైరల్ అవుతోంది. ఆ పిక్ రొమాంటిక్ గా ఉండడమే కాకుండా ‘వైల్డ్ థింగ్స్ వెతుకుతున్నా’ అంటూ పాయల్ ప్రియుడు కామెంట్ చేయడం గమనార్హం.

ఇక విషయంలోకి వెళ్తే… చాలా మంది నటీ నటులకు వారి నిజ జీవిత భాగస్వాములతో కలిసి నటించే అవకాశం లేదు. ఆ అరుదైన అవకాశం దక్కించుకున్న అతి కొద్ది మంది నటీనటుల్లో పాయల్ రాజ్‌పుత్ ఒకరు. పాయల్ గత కొంతకాలంగా సౌరభ్ ధింగ్రాతో డేటింగ్ చేస్తోంది. వీరిద్దరూ తమ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో రొమాంటిక్ పిక్స్, వీడియోలు షేర్ చేస్తూ ఉంటారు.

Read Also : అక్కినేని ఫ్యాన్స్ కు “బంగార్రాజు” ట్రీట్… వరుస అప్డేట్స్

రీసెంట్ గా వీరిద్దరూ కలిసి నటించిన వెబ్ సిరీస్ “3 రోజెస్‌” విడుదలైంది. ఈ జంటకు ఇందులో కలిసి నటించే అవకాశం వచ్చింది. ఈ సిరీస్‌లో ఇద్దరూ రొమాంటిక్ గా, బోల్డ్ సన్నివేశాలులో కూడా కన్పించారు. తాజాగా సౌరభ్ “3 రోజెస్” విజయాన్ని సెలెబ్రేట్ చేసుకున్నారు. కాన్సెప్ట్ షూట్ కోసం పాయల్‌తో కలిసి పోజులిచ్చిన చిత్రాన్ని ఇందులో పంచుకున్నాడు. సౌరభ్ తెల్లటి షర్ట్‌లో కనిపిస్తుండగా, పాయల్ పులి చర్మం ఉన్న ఉన్ని జాకెట్ ధరించి ఉంది. వీరిద్దరి కెమిస్ట్రీని చిత్రంలో చూడొచ్చు.. “వైల్డ్ థింగ్స్ ఎక్కడ ఉన్నాయో వెతుకుతున్నా “3 రోజెస్”లో ఒక గులాబీని దొంగిలించాను” అని సౌరభ్ ఈ ఫొటోకు కామెంట్ చేశారు. ఈ ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.

Related Articles

Latest Articles