మళ్లీ కరోనా బారినపడ్డ పవన్‌ నిర్మాత..

కరోనా మహమ్మారి ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదు. సీని, రాజకీయ ప్రముఖులను సైతం కరోనా వెంటాడుతోంది. అయితే కరోనా సోకి దాని నుంచి బయటపడినవారికి సైతం మరోసారి కరోనా సోకుతోంది. టాలీవుడ్‌ ఇండస్ట్రీలో సూపర్‌ స్టార్‌ మహేశ్‌, ప్రముఖ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎస్‌ఎస్‌ తమన్‌, హీరో విశ్వక్‌సేన్‌ ఇటీవల కరోనా పాజిటివ్‌ రావడంతో ఐసోలేషన్‌లో ఉన్నారు. అయితే తాజాగా నిర్మాత బండ్ల గణేష్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్థాణైంది.

అయితే ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. ఆయన గత మూడు రోజులుగా ఢిల్లీలో ఉన్నట్లు ఈ రోజు సాయంత్రం కరోనా పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా నిర్థారణైనట్లు ఆయన వెల్లడించారు. ఆయన ఒక్కరే ఢిల్లీలో ఉన్నారని, ఆయన కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించగా నెగిటివ్‌ వచ్చినట్లు ఆయన వెల్లడించారు. ఆయన స్వల్ప లక్షణాలు ఉన్నట్లు తెలిపారు. గతంలో రెండు సార్లు బండ్ల గణేష్‌కు కరోనా సోకింది.

Related Articles

Latest Articles