పవన్ కళ్యాణ్ కూతురు బుల్లితెర ఎంట్రీ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణూ దేశాయ్ ల కూతురు ఆద్య బుల్లితెర ఎంట్రీ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. తాజాగా ఆద్య ఓ ఛానెల్ లో ప్రసారం అవుతున్న ‘డ్రామా జూనియర్స్’ షోలో పాల్గొని బుల్లితెర ఎంట్రీ ఇచ్చింది. తాజాగా సదరు షోకు సంబంధించిన ప్రోమో విడుదలవ్వగా… అందులో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది ఆద్య. ‘డ్రామా జూనియర్స్’ షోకు రేణూ దేశాయ్ జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఆద్య అలా వేదికపై కన్పించడంతో రేణూ దేశాయ్ హ్యాపీగా ఫీల్ అయ్యింది. ఇక వేదికపై ఆద్య ‘బెస్ట్ మదర్ ఎవర్’ అంటూ రేణూ దేశాయ్ గురించి చెప్పడం ఈ ఎపిసోడ్ లో బెస్ట్ మూమెంట్ అని చెప్పొచ్చు. తన పిల్లలు అఖిరా నందన్, ఆధ్యా… వాళ్ళ తండ్రి పవన్ కళ్యాణ్ లాగా నటులు కావాలనుకుంటే ఆపను అని రీసెంట్ గా స్పష్టం చేసింది రేణు. ఇక గతకొంతకాలం నుంచి అఖిరా నందన్ వెండితెర ఎంట్రీపై కూడా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-