“భవదీయుడు భగత్ సింగ్”గా పవన్… ఫస్ట్ లుక్ అదిరింది !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో ఓ మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ ను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ‘పిఎస్పీకే 28’ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన పవర్ ప్యాక్డ్ అప్డేట్ అంటూ నిన్నటి నుంచే మేకర్స్ మెగా ఫ్యాన్స్ ను ఊరించారు. దాంతో ఈ రోజు ఈ సినిమా అప్డేట్ గురించి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చెప్పినట్లుగానే తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్, టైటిల్ ను రివీల్ చేస్తూ పోస్టర్ వదిలారు. “భవదీయుడు భగత్ సింగ్” అనే టైటిల్ ను ఖరారు చేస్తూ విడుదల చేసిన పోస్టర్ లో పవన్ కళ్యాణ్ స్టైలిష్, యంగ్ లుక్‌లో కన్పిస్తున్నారు.

Read Also : “ఆర్సీ 15” ప్రారంభోత్సవానికే అంత ఖర్చు పెట్టేశారా !!

ఇండియా గేట్ ముందు స్పోర్ట్స్ బైక్ మీద కూర్చుని పవన్ ఒక చేతిలో టీ, మరో చేతిలో మెగాఫోన్ తో కన్పించిన లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. దర్శకుడు హరీష్ శంకర్ ఫస్ట్ లుక్ తోనే మెగాభిమానుల మనసు దోచుకున్నాడు. వారి అంచనాలను అందుకునేలా ఫస్ట్ లుక్ పోస్టర్ ను డిజైన్ చేయడంలోఆయన సక్సెస్ అయ్యాడు. ‘ఈసారి ఇది కేవలం వినోదం మాత్రమే కాదు’ అనే ట్యాగ్‌లైన్ ఉత్సుకతని రేకెత్తించింది. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా అయనంక బోస్ సినిమాటోగ్రాఫర్ కాగా, ఎడిటింగ్ చోటా కె ప్రసాద్.

Image

Related Articles

Latest Articles

-Advertisement-