ఎనలేని ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు : పవన్ కళ్యాణ్

సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా నిన్న ఆయనకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సెలెబ్రిటీల దగ్గర నుంచి అభిమానుల వరకు అంతా నిన్న ఆయన నామజపమే చేశారు. పైగా ఆయన నటిస్తున్న సినిమాల నుంచి వచ్చిన అప్డేట్స్ సోషల్ మీడియాలో పండగ వాతావరణాన్ని తలపించాయి. నిన్న సోషల్ మీడియాను “పవర్” స్టార్మ్ చుట్టు ముట్టేసింది. ఈ నేపథ్యంలో పవన్ ఫ్యాన్స్ అభిమానానికి కృతజ్ఞతలు తెలుపుతూ సోషల్ మీడియాలో ప్రత్యేకంగా ఓ పోస్ట్ చేశారు.

Read Also : నేడు ఈడీ ముందుకు రకుల్ ప్రీత్ సింగ్

“ఎనలేని ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు

నా చుట్టూ ఉన్న సమాజం ఎల్లవేళలా క్షేమంగా ఉండాలనే భగవంతుణ్ణి ప్రార్థిస్తుంటాను. యేడాదిన్నర కాలంగా దేశం కరోనా మహమ్మారితో పోరాడుతూనే ఉంది. సెకండ్ వేవ్ ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే కుదుటపడుతుంది. కష్ట జీవుల జీవనం ఇంకా గాడినపడలేదు. ఇలాంటి క్లిష్ట సమయంలో జన్మదిన శుభాకాంక్షలు అందుకోలేను అనే ఉద్దేశంతో దైవ చింతనలో గడిపాను. సహజంగానే నేను పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉంటానని నన్ను అభిమానించేవారికి తెలుసు.
నాపై ఉన్న అపార ప్రేమాభిమానాలతో ఎందరో హితైషులు, సన్మిత్రులు, శ్రేయోభిలాషులు, సమాజ సేవకులు, రాజకీయ నేతలు, సినీ తారలు, దర్శకులు, సాంకేతిక నిపుణులు, మీడియా ప్రతినిధులు, ప్రవాస భారతీయులు, నన్ను తమలో ఒకడిగా భావించే అభిమానులు, జన సైనికులు, వీర మహిళలు, జనసేన నాయకులు సామాజిక మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు అందచేశారు. జనసేన శ్రేణులు, అభిమానులు సామాజిక సేవ కార్యక్రమాలు చేపట్టి తమ అభిమానాన్ని సేవామార్గంలో వెల్లడించారు. పెద్దలు, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారు శుభాశీస్సులు అందించారు. ప్రతి ఒక్కరూ ఎంతో వాత్సల్యంతో నాకు శుభాకాంక్షలు అందించారు. వెల కట్టలేని ఈ అభిమానానికి, వాత్సల్యానికి నేను సర్వదా కృతజ్ఞుడిని. అందరికీ పేరుపేరునా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను.

(పవన్ కల్యాణ్)” అంటూ పవన్ అందరికి శుభాకాంక్షలు తెలియజేశారు.

Related Articles

Latest Articles

-Advertisement-